Friday, 31 July 2026 01:36:03 PM

కుబేర కవర్ సాంగ్ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రజాధరణకు ఘన సన్మానం....

Date : 02 August 2025 12:24 PM Views : 860

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : ప్రముఖంగా ప్రజాధరణ పొందిన కుబేర కవర్ సాంగ్ యూట్యూబ్‌ వీడియోలో భాగంగా పాటలో నటించిన కళాకారులకు ఘన సన్మానం జరిగింది. ఓదెల మండల కేంద్రంలోని రంగుల దుకాణం సెంటర్‌ వద్ద గ్రామ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా పాటలో నటించిన కడవేర్గుల రమేష్, చైల్డ్ ఆర్టిస్ట్ అభిజిత్, సాంగ్ నిర్మాత, ఎడిటర్ శ్రీరామోజు శ్రీనివాస్, డీఓపీ తోట శ్రీనివాసు లకు శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు.అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టైలర్ శ్రీనివాస్, డాక్టర్ భీష్మ చారి నేత, క్యాతం వెంకటేశ్వర్లు, మెడికల్ రాజేంద్రప్రసాద్, నాగభూషణం, బూర రామచంద్రం, కుమార్, తాడికొండ సత్యం, ఆరకాల సదానందం, సింగం సోడాల రాజేందర్, గోపతి తిరుపతి, డాక్టర్ మాటేటి రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.ఈ అభినందన కార్యక్రమం స్థానికంగా హర్షం కలిగించింది. యూట్యూబ్‌ లో ప్రజల ఆదరణతో ఈ కవర్ సాంగ్‌ మంచి గుర్తింపు పొందినందుకు సన్మానితులందరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :