Thursday, 30 July 2026 02:42:54 PM

డయాగ్నోసిస్ సెంటర్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి...

జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి...

Date : 25 March 2025 07:39 PM Views : 489

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ప్రైవేట్ డయాగ్నోసిస్ సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్నకుమారి తెలిపారు. ఈ సందర్బంగా ప్రైవేట్ డయాగ్నో సిస్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శాంతి నగర్ లోని లక్మి శ్రీనివాస డయాగ్నొస్టిక్ అండ్ ఇమేజింగ్ సెంటర్, కమాన్ రోడ్ లైన్ లో గల ప్రైమ్ డయాగ్నొస్టిక్ సెంటర్ లను తనిఖీ నిర్వచించారు. రికార్డు లను క్షుణ్ణంగా పరిశీలించారు. గత తేదిలలోని ఇమేజింగ్ లను కూడా చూశారు. "పుట్టబోయేది ఆడబిడ్డా, మగ బిడ్డా అని ఇక్కడ చెప్పబడదు, అది చట్ట రీత్యా నేరం" అని బోర్డులు అందరకి కనపడేలా పెట్టాలన్నారు. నక్షత్ర కంటి దవాఖానా, మల్లికార్జున హాస్పిటల్, తిరుమల హాస్పిటల్, అనీస్ హోమియో క్లినిక్ లను తనఖి చేశారు. చిన్న లోపాలు ఉంటే సరిచేసుకోవాలన్నారు. ప్రైస్ లిస్ట్ ప్రకారం మాత్రమే ఫీజు తీసుకోవాలని అన్నారు. అలాగే చట్ట ప్రకారం నిబంధనలు పాటించాలని అన్నారు. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :