ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అప్పటి ప్రజల అవసరాల రీత్యా అలాగే ఎఫ్ సీఐ వ్యర్థాలను వదలడానికి పారిశ్రామిక ప్రాంతంలో ప్రవహిస్తున్న ప్రధాన నాలా 30 నుండి 40 ఫీట్ల వెడల్పు ఉండేది అయితే ఈ ప్రధాన నాలాను సాయిలీల బార్ అండ్ రెస్టారెంట్ నిర్మించడానికి ఐదు నుంచి 6 ఫీట్లకు నాలను కుదించి ఎలాంటి సెట్ బ్యాక్ వదలకుండా నిర్మించిన భవనాన్ని తొలగించి నాలాను వెడల్పు చేయాలని అఖిలభారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య రామగుండం నగరపాలక సంస్థ ఇంచార్జీ కమిషనర్ ని వినతి పత్రంలో కోరారు. రామగుండం కార్పొరేషన్ లో ప్రవహిస్తున్న నాలా ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది దాని వెడల్పు ఎంత అని సమాచార హక్కు చట్టం కింద నగరపాలక సంస్థను కోరినప్పటికీ తమ దగ్గర సమాచారం లేదని దాట వేస్తున్నారని కమిషనర్ కి తెలియజేయడం జరిగిందన్నారు. కావున రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రధాన నాలను పూర్తిగా సర్వే చేయించి నాలా వెడల్పును గుర్తించి నిర్మాణాలు కానీ నాలా బఫర్ జోన్ లో నిర్మాణాలు కానీ చేపట్టి ఉంటే వాటిని వెంటనే కూల్చివేయాలని కమిషనర్ ని కోరారు. నగరం నడిబొడ్డున సాయి లీల బార్ అండ్ రెస్టారెంట్ వారు ప్రధాన నాలను ఒక చిన్న కాలువలాగా మార్చి దాదాపు 20 ఫీట్ల నాలా స్థలాన్ని కబ్జా చేసి భవనాన్ని నిర్మించారని వారి పైన నూతన మున్సిపల్ చట్టం 2019 ప్రకారం సాయి లీల యజమాన్యంపై చర్యలు తీసుకోవడంతో పాటు నాలాను వెంటనే వెడల్పు చేయాలని నాలా స్థలంలో కట్టిన భవనాన్ని తొలగించాలని సూర్య డిమాండ్ చేశారు. ఇప్పటికే ఓవైపు సింగరేణి స్థలాన్ని కబ్జా చేసిన సాయిలీల బార్ & రెస్టారెంట్ వారు మున్సిపల్ నాలాను సైతం వాడుకుంటూ అధికారులను ప్రభుత్వ సంస్థలను లెక్క కట్టకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని సూర్య కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి ఆసాల నవీన్ ఉన్నారు
Admin
Aakanksha News