ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తార ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో అఖిల భారత ఉగాది కల ఉత్సవ్ పురస్కారాలు 2025 అవార్డ్స్ ను నిర్వహించారు. ఈఅవార్డు కోవిడ్, సింగరేణి రెస్క్యూ లలో క్లిష్టమైన పరిస్థితుల్లో అమూల్యమైన సేవలు అందించినందుకు గోదావరిఖని సివిల్ డిపార్ట్ మెంట్ వాల్ ఆపరేటర్ కుందూరు బుచ్చిరెడ్డిని ఎంపిక చేసారు.పరికిపండ్ల నరహరి (మధ్యప్రదేశ్ IAS ) సిని నటులు సుమన్ చేతుల మీదుగా అవార్డు ల ప్రదానోత్సవం చేసారు. ఈ అవార్డు కి ఎంపిక చేసినందుకు తార ఆర్ట్స్ కమిటీ అధ్యక్షులు రాజేష్, కమిటీ సభ్యులకు , సింగరేణి యజమాన్యంకి ధన్యవాదాలు తెలిపారు.
Admin
Aakanksha News