ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ ఇళ్లల్లో పెంపుడు జంతువులను కలిగి ఉంటున్నారు. కొంత మంది అయితే తమ పెంపుడు జంతువులను ఇంట్లోని మనుషుల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. పెంపుడు జంతువులంటే ప్రాణామిస్తారు.కుక్కలను పెంచుకునే వాళ్లను డాగ్ లవర్స్ అని పిలుస్తారు. ఈ పరిధి దాటి ఇప్పుడు పెట్ పేరెంట్స్ గా చెప్పే స్ధాయికి చేరింది.డాగ్స్ ఈ పేరు విశ్వానికి మారుపేరు. అందుకే పెంపుడు జంతువుల్లో డాగ్ ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. ఇలా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఓ కార్మికుడి పెంపుడు కుక్క (జర్మనీ చీప్) అధికార పార్టీకి చెందిన తెలిసి తెలియని ఖాద్దర్ చొక్క నాయకుడి అనాలోచిత చేష్టల వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 7వ డివిజన్ లోని ఉదయ్ నగర్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే...తుమ్మ రాజేష్ అనే సింగరేణి కార్మికుడు జీడీకే 11 ఇంక్లైన్ లో సీఎం ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పెంపుడు జంతువుల మీద ఉన్న మమకారంతో గత 7నెలల క్రితం జర్మనీ చీప్ అనే డాగ్ ను తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. అయితే అదే కాలనీకి చెందిన అధికార పార్టీ నాయకుడు నాజీముద్దీన్ కొంత మందితో కలసి బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి బయట ఉన్న మా యొక్క కుక్కకు ఇంజక్షన్ వేయించారని ఇదేంటి అని అడిగితే ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఇంజక్షన్ వేశామని తెలిపినట్లు భాధితుడు తుమ్మ రాజేష్ అన్నారు. అయితే ఇంజక్షన్ వేసిన కొద్దీ సేపటికే కుక్క కింద పడిపోయిందని ఏమైంది అని అడిగితే మంచినీరు తాగించండి ఏమి కాదు 15 నిమిషాల్లో మళ్లీ లేస్తుందని చెప్పారని అన్నారు. అయితే ఎంత సేపటికి కుక్క లేవకపోయే సరికి ఏమైంది అని వెళ్లి చూడగా రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందిందని భాధితుడు రాజేశం కన్నీటి పర్యాంతమయ్యడు. ఇదే విషయాన్ని భాధితుడు ఉన్నతధికారుల దృష్టికి తీసుకవేల్లగా తాము ఎవరిని మున్సిపల్ తరుపున పంపించలేదని తెలియజేసినట్లు రాజేశం పేర్కొన్నాడు. పెంపుడు జంతువు మృతికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాజీముద్దీన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక్కటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా బాధితుడు పిర్యాదు చేసాడు...
అసలు ఏవరు ఈ నాజీముద్దీన్...?
అసలు ఏవరు ఈ నాజీముద్దీన్.. ఆయనేమన్న ప్రభుత్వ ఉద్యోగినా.. లేక మున్సిపల్ ఉద్యోగినా... లేకపోతే స్థానిక కార్పొరేటరా...? ఏ అధికారం ఉందని మున్సిపల్ కు సంబంధించిన సిబ్బందిని తీసుకవచ్చి పెంపుడు జంతువుకు ఇంజక్షన్ వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే ఏది చేసిన చెల్లుతుందనే భావన... లేక మరేదైనా కారణం ఉందా...? మూగ జీవాలను చంపే అధికారం ఎక్కడిది...? అని స్థానికుల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే మూగజీవాలను చంపితే ఏనిమల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నో ఎన్జీవో సంస్థలు ప్రచారాలు నిర్వహిస్తున్న కనీస నిబంధనలను గాలికి వదిలేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు ఖాద్దర్ చొక్కా అనాలోచిత చేష్టల వల్ల మూగజీవి చావుకు కారణం అయిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ తో పాటు కోర్టును, ఎన్జీవో సంఘాలను బాధితుడు ఆశ్రయించాడు.
Admin
Aakanksha News