Sunday, 26 April 2026 05:38:58 PM

చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి......

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి..

Date : 20 September 2025 03:37 PM Views : 319

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : విద్యార్థులు భారత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వప్నరాణి అన్నారు. శనివారం హనుమంతునిపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి స్వచ్చభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ఎస్ఎస్ శిబిరాన్ని సదర్శించి కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పరిసరాలని పరిశుభ్రంగా వుంచుకొని, ఆరోగ్యంగా వుండాలని సూచించారు. చిన్నతనం నుండే సేవాభావం అలవాటు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు గంజాయి వంటి మత్తుపదార్థలకు దూరంగా ఉండలని, పోక్సో తదితర చట్టాలపై సమగ్రమైన విషయం పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అశోక్, న్యాయవాదులు మామిడిపల్లి శరత్ కుమార్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :