Thursday, 30 July 2026 06:44:02 PM

పెద్దపల్లి టౌన్‌లో 108 అంబులెన్స్‌పై ప్రోగ్రాం మేనేజర్ ఆకస్మిక తనిఖీ..

Date : 08 August 2025 06:01 PM Views : 471

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి పట్టణంలోని 108 అంబులెన్స్‌ సేవలను ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరు, అవసరమైన వైద్య సదుపాయాలు, రోగి రికార్డులు, అంబులెన్స్‌లోని శుభ్రత, సిబ్బంది విధి నిర్వహణ వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు. తనిఖీ అనంతరం ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలు సమయానుకూలంగా అందుబాటులో ఉండేలా సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు, రోడ్డు ప్రమాద బాధితులు, పాము కాటు బాధితులు వంటి అత్యవసర రోగులకు వెంటనే సేవలందించేందుకు సదా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అలాగే, మండల ప్రజలు 108 అంబులెన్స్ సేవలను అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాలని కోరారు.తనిఖీ సమయంలో పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ కుమారస్వామి, ఈఎంటీ షానగంటి నరేష్, దేవేందర్, రామినేని రవి, సటుకూరి రాజకుమార్, పూరెల్ల అఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ తనిఖీ ద్వారా సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని అధికారులు సంకల్పించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :