Friday, 31 July 2026 02:39:10 PM

తెలంగాణ అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...

Date : 17 February 2025 11:59 AM Views : 416

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పేద ప్రజల చిరస్మరణీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులని పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు జిమ్మీ బాబు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాద్యులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రైతులు, విద్యార్థులు. మహిళలు, వృద్ధులు. వికలాంగుల కోసం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని వారు కొనియాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షోభం దృష్టిలో పెట్టుకొని త్వరలో ముఖ్యమంత్రి అవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ దాని అనుబంధ సంఘాల నాయకులు మాజీ శాసన సభ్యులు కోరుకంటి చందర్, గోపు ఐలయ్య యాదవ్. పెంట రాజేష్. నీరటి శ్రీనివాస్. పాము కుంట్ల భాస్కర్. తదితరులు పాల్గొన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :