Thursday, 30 July 2026 07:57:35 PM

సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం అధికమైంది....మాజీ మంత్రివర్యులు, సీనియర్ కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్‌

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కఠినంగా పోరాడాల్సిన అవసరం ఉంది...

Date : 21 July 2025 09:34 PM Views : 464

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం (TBGKS) కొత్త ఇంచార్జిగా నియమితులైన మాజీ మంత్రివర్యులు, సీనియర్ కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్‌ కు గోదావరిఖనిలో ఘనస్వాగతం లభించింది. సింగరేణి కార్మిక హక్కులు, సంక్షేమ పథకాలు, సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే లక్ష్యంతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ఈశ్వర్‌ను ఇంచార్జిగా నియమించారు.గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ అంబేద్కర్ చౌరస్తా నుండి రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు TBGKS నాయకులు, సింగరేణి ఉద్యోగులు, BRS శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘనస్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తలు తరలివచ్చారు. రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో TBGKS రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, TBGKS అధికార సంఘంగా ఉన్న పదేళ్లలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహకారంతో సింగరేణి ఉద్యోగులకు ఎన్నడూలేని సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. కారుణ్య నియామకాల ద్వారా సుమారు 20 వేల మంది ఆధారితులకు ఉద్యోగాలు, పది లక్షల వడ్డీలేని గృహ రుణాలు, మహిళలకు ఉద్యోగావకాశాలు, మెరుగైన కార్పొరేట్ వైద్యం, క్వార్టర్లలో AC సదుపాయం వంటి పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం అధికమైందని, సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం అవసరమని ఈశ్వర్ స్పష్టం చేశారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో TBGKS ను గుర్తింపు సంఘంగా నిలబెట్టడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో BRS పెద్దపల్లి అధ్యక్షుడు కోరుకంటి చందర్, పుట్ట మదుకర్, నడిపెల్లి దివాకర్, కౌషిక హరి, ఒరుగంటి రమణారావు, పిటి స్వామి, సురెందర్ రెడ్డి, మాదాసి రామ్మూర్తి, నూనెకొమురయ్య, పర్లపల్లి రవి, జావిద్ పాషా, సంపత్ రెడ్డి, ప్రబాకర్ రెడ్డి, వడ్డెపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి సాంబయ్య, బండి రమేష్, మెడిపల్లి సంపత్, మల్రాజ్ శ్రీనివాసరావు తదితరులు, పెద్ద సంఖ్యలో TBGKS శ్రేణులు, BRS కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :