Sunday, 26 April 2026 05:37:20 PM

30 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలపై కూడా నేను చర్చకు సిద్ధమే...

రామగుండంలో అక్రమ దందాలపై బహిరంగ చర్చకు సిద్ధమా...? మాట మీద నిలబడి సవాల్ ను స్వీకరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి... బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పోచమ్మ గుడిలో పూజలు...

Date : 11 March 2025 12:54 PM Views : 836

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రామగుండం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న వివాదాలు అందరిలోనూ చర్చకు దారితీస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా నియోజకవర్గంలో బూడిద, ఇసుక, మట్టి దందాలు నడుస్తున్నాయని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు ఆందోళన కార్యక్రమాలను చేయడంతో పాటు అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అంతర్గం మండల కేంద్రంలోని మట్టి అక్రమ రవాణా విషయంలో కౌశిక హరి మట్టిని తీసుకువెళ్లే చోటుకు వెళ్లి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మట్టికి సంబంధించిన కాంట్రాక్టర్ ఆడపు వెంకటేష్ ఇటీవల పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి మట్టి విషయంలో డబ్బులు డిమాండ్ చేశాడని, అయితే డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో అక్రమ రవాణా చేస్తున్నామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రవాణా విషయంలో నా వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. నువ్వు హిందువు అయితే తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వెళ్లాలని వెంకటేష్ సవాల్ విసిరారు. ఈ సవాల్ కు స్పందించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి రామగుండం రాజకీయాల్లో సంచలనానికి దారి తీశారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తనకు తాను నిరూపించుకోవడానికి పార్టీ నాయకులతో కలిసి వెంకటేష్ చేసిన ఆరోపణలకు నిజనిర్ధారణ చేయడానికి కౌశిక హరి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానం ఆవరణలో స్నానం చేసి తడి బట్టలతో గుడిలోకి పూజలు నిర్వహించి ఆయన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి మాట్లాడుతూ.... రామగుండం నియోజకవర్గంలో ఇసుక, మట్టి, బూడిద దందాలు యదేచ్చగా కొనసాగుతున్నాయని వీటిపై ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ను ప్రశ్నించినందుకే తన అనుచరులతో కలిసి తనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే ఇసుక మట్టి బూడిద వద్దకు వచ్చి నిజనిర్ధారణ చేసి రామగుండం ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అవసరమైతే స్థానికంగా జరిగే దందాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మక్కాన్ సింగ్ దోపిడి వల్ల న్యాయం జరుగుతుందా...? అన్యాయం జరుగుతుందా అనేదానిపై నేను చర్చకు సిద్ధమని గోదావరిఖని పోచమ్మ గుడి, రామాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎక్కడికైనా నేను చర్చకు సిద్ధమని దీనిపై బూడిద మట్టి ఇసుక సంబంధించిన అందరి కాంట్రాక్టర్లను చర్చకు పిలిపించాలని కౌశిక హరి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేవలం నేను పాలనలో జరిగే అవినీతి మీపైనే మాట్లాడుతున్నానని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే వాటిపై సమాధానం చెప్పకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అంతే కాకుండా పార్టీలు మారారని నన్ను విమర్శిస్తున్నారని పార్టీలు ఎవరు మారలేదు, ఎంతమంది మారలేదు ఇప్పుడున్న దాంట్లో పార్టీలు మారని వారు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. కాదు పోదు అంటే ఏదైనా చర్చ పెడదామంటే 30 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలపై కూడా నేను చర్చ పెట్టడానికి సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి ఘాటుగా స్పందించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :