Thursday, 30 July 2026 12:26:42 PM

ప్రతిభ కనబరిచిన గాయత్రి విద్యానికేతన్ విద్యార్థిని...

Date : 07 March 2025 05:29 PM Views : 398

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ - మనక్ పోటీలలో భాగంగా రోడ్డు ప్రమాదాల ముందస్తు నివారణ అనే అంశంపై పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన 9 వ తరగతి విద్యార్థిని అమీమా తహ్రీం ఎంపికైనట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి రఘునందన్ రావు, ఇన్స్పైర్ అవార్డ్ కి ఎంపికైన విద్యార్థినికి సర్టిఫికెట్ తో పాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం విద్యార్థిని అమీమా తహరీమ్ ను అభినందించి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్, గైడ్ టీచర్స్ సదానందం తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :