ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పోరాటాల పురిటిగడ్డగా పేరు గాంచిన రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపిసి, రామగుండం తెలంగాణ పవర్ ప్రాజెక్టు, రామగుండం ఎరువుల కర్మాగారం, సింగరేణి పరిశ్రమలకు నీలయంగా మారింది. అయితే ఎక్కడి ప్రజల జనాభా కూడా ఎక్కువగా ఉండటంతో కార్పొరేషన్ పరిధిలో ఆదాయ వనరులు సైతం అదే స్థాయిలో ఉంటుంది. అయితే రామగుండం నియోజకవర్గానికి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలనీ ఎంతో మంది నాయకులు స్వచ్చంద సంఘాల నాయకులు ఎన్నో పోరాటాలు నిర్వహించారు. పెద్దపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉండటంతో అక్కడికి వెళ్ళడానికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. పెద్దపల్లి, రామగుండం రెండు ప్రాంతాలకు కలిపి ఒకే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉండేది. అయితే చూట్టు ఉన్న మంథని, సుల్తానాబాద్ లో కూడా ఆయా మండలాలకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉండేవి. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి అన్ని వర్గాల ప్రజలు, స్వచ్చంధ సంఘాలు అధికారులకు వినతులు సమర్పించడంతో ప్రభుత్వం ఎట్టకేలకు రామగుండం, పాలకుర్తి, అంతర్గం మండలాలకు కలిపి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేసారు. దితో ఎంతో ,మందికి ఉపాధి దొరకడంతో పాటు స్థానికంగా ఇబ్బందులు తొలిగిపోతాయని భావించిన స్థానికులకు మల్లి నిరాశే మిగిలింది. పారిశ్రామిక ప్రాంత ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇతర ప్రాంతం నుండి వచ్చిన కొందరు అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. కనీసం స్థానికంగా ఉండే నిరుద్యోగులు, ఇతర చిన్న చిట్కా పనులు నిర్వహించే వారు ఏదైనా షాపును ఏర్పాటు చేసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది. ఇతర ప్రాంతం నుంచి వచ్చి స్థానికంగా షాపులను నెలకొల్పి లోకల్ లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. గతంలో పెద్దపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్న సమయంలో స్థానికంగా ఉండే కొందరు తమ వ్యాపారాలను నిర్వహించేవారు. కనీసం ఇతర ప్రాంతాల వారికి చిన్న చితక అవకాశాలు కూడా లేకుండా రామగుండంలోనూ అదే పెత్తనం కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్థానికతకు పెద్దపీట ఎక్కడా...⁉️
ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్థానికులకు మళ్లీ నిరాశే మిగిలింది. గతంలో పెద్దపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్న సమయంలో కనీసం అక్కడ చిన్న షాపు కూడా ఏర్పాటు చేసుకోనివ్వకుండా సిండికేట్ గా వ్యవహరించి రామగుండం నిరుద్యోగులను అన్యాయానికి గురి చేసినట్లు ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. అయితే సింగరేణి ఓసిపి-5 లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నినాదంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని స్వంత గ్రామాలకు తరలించారు. అయితే ఇలాగే రామగుండంలో ఏర్పడిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనూ లోకల్, నాన్ లోకల్ వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పెద్దపల్లిలో ఉన్న సమయంలో కనీసం ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వని వారు మళ్లీ పెద్దపల్లి విడిచి పెట్టి రామగుండంకు వచ్చి స్థానిక నిరుద్యోగుల ఉపాధిని పొట్టగొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్దపల్లి, రామగుండం రెండు చోట్ల వారే ఉంటె ఇంకా స్థానికులకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి పారిశ్రామిక ప్రాంత ప్రజలు, కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇక్కడి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడి ప్రాంత యువతకు, స్థానికులకు ఉపాధిని కల్పించేందుకు స్థానిక అధికారులు, నాయకులు చర్యలు తీసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద స్థానికులే షాపులను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
స్థానికేతరుల పెత్తనం కొనసాగించడం సరికాదు... మద్దెల దినేష్
ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి సంబంధించిన శాఖ అధికారులకు వినతి పత్రాలు అందించి గతంలో ముఖ్యమంత్రి గోదావరిఖనికి వస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తుంటే అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగిందని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ అన్నారు.అలాంటి పోరాటాలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మంజూరు చేసుకుంటే ఏడాదిన్నరకు పైగానే జిల్లాలో కొనసాగితే జిల్లా గౌరవ కలెక్టర్ కోయ హర్షని అనేక మార్లు కలిసి గోదావరిఖని ప్రాంతానికి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించాలని వినతులు ఇస్తే వారు స్పందించి గోదావరిఖనికి కాకుండా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తరలించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం రామగుండంకు విచ్చేసినప్పటికీ స్థానిక నిరుద్యోగులకు దస్తావేజుల కార్యాలయం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని ఆశపడితే ఇతర ప్రాంతాలకు చెందిన స్థానికేతరులు సబ్ రిజిస్టర్ కార్యాలయం చుట్టూ దాదాపు సగానికి ఎక్కువ ఇతరులే ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోని పెత్తనం కొనసాగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికలకు నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. స్థానికేతరులు చేయబట్టి స్థానికులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని కావున ఇతర ప్రాంతలా వారికి అవకాశం ఇవ్వదని స్థానికులకే న్యాయం జరగాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News