Thursday, 30 July 2026 07:16:22 PM

కనీస వేతనాలను నిర్ణయించే బోర్డులో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులను నియమించాలి..

ఐ ఎఫ్ టీ యు.రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణ డిమాండ్..

Date : 14 December 2024 06:18 PM Views : 634

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కనీస వేతనాలను నిర్ణయించే బోర్డులో అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులను నియమించాలి ఐ ఎఫ్ టీ యు.రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...దివంగత మాజీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో నిర్ణయించిన కనీస వేతనాల చట్టంను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో కనీసం పట్టించుకోలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస వేతనాలను సవరించి,75 షెడ్యూల్డ్ రంగాలకు సంబంధించిన జీఓలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విడుదల చేయలేదని తెలిపారు.అలాగే కనీస వేతన ఛైర్మెన్ ను మాత్రమే నియమించిందన్నారు. అలాగే సభ్యులను నియమించకుండా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కనీస వేతన సవరణ చట్టం సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీఓలను విడుదల చేయాలని,కనీస వేతన బోర్డులో కార్మిక సంఘాలతో నియమించాలని డిమాండ్ చేశారు. కనీస వేతన బోర్డులో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకుండా కేవలం ఐ ఎన్ టీ యు సీ, ఏఐటీయుసీ లకే అవకాశం ఇవ్వడం సరైంది కాదని, రెండు సంఘాలతో పాటు మిగతా కార్మిక సంఘాలకు కూడా విధిగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.లేదంటే ఐ ఎఫ్ టి యు స్వతంత్రంగా,ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.ఈ పవిలేకరుల సమావేశంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ప్రధాన కార్యదర్శి బి అశోక్, ఉపాధ్యక్షులు చిలుక శంకర్, జిల్లా నాయకులు మల్యాల దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఐ సాంబయ్య, ప్రవీణ్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :