Thursday, 30 July 2026 01:47:51 PM

గోదావరిఖని చౌరస్తాలో సింగరేణి క్వాటర్ల కూల్చివేతలు నిలిపివేయాలి.. !!!

HMS, IFTU,TSUS, AIFTU. నాయకుల డిమాండ్..

Date : 19 November 2024 06:47 PM Views : 840

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని గాంధీ నగర్ హెచ్ఎంఎస్ కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సమావేశానికి హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్,ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కామర గట్టయ్య, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి రాములు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గోదావరిఖనిలో అభివృద్ధి పేరిట రోడ్లు వెడల్పు కార్యక్రమానికి పూనుకున్న సింగరేణి యాజమాన్యం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా క్వాటర్లను తొలగించడం సరియైనటువంటిది విధానం కాదన్నారు.కార్మికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కార్మికుల అభిప్రాయం మేరకు వారికి సంతృప్తికరంగా కార్యక్రమం చేపట్టాలని అన్నారు.కార్మిక సంఘాలు కార్మికులకు అండగా నిలబడాలని సింగరేణి యజమాన్యం అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించాలని అన్నారు. సింగరేణి యాజమాన్యం పునరాలోచించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు నాయకులు జక్కుల నారాయణ, ఈ నరేష్, ఆంజనేయులు, కృష్ణ ప్రసాద్, రత్నకుమార్, కుమార్. తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :