Thursday, 30 July 2026 12:50:49 PM

ప్రభుత్వ అస్పత్రిలో మితిమీరుతున్న మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జోక్యం... రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి..

అసలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాలా! ప్రభుత్వ దవఖాన సూపరిడెంటా...!! ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం...

Date : 11 August 2025 01:06 PM Views : 872

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జోక్యం పెరిగిపోతుందని... అసలు మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ అ లేక ఆసుపత్రికి సూపరిండెంట్ అ అని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ప్రశ్నించారు. ఈ సందర్భంగా రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ... రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వారంలో మూడు రోజులు మాత్రమే కళాశాలకు వస్తున్నారని, మిగతా రోజుల సంగతి మాకు తెలియదని విద్యార్థులు చెప్పారని ఆయన అన్నారు. ప్రధానంగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సరిపడు ప్రొఫెసర్లు లేనప్పటికీని , ప్రిన్సిపాల్ గా పాఠాలు బోధించకుండా, ప్రొఫెసర్ల కొరతపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పాఠాలు బోధించి పోటీ తత్వాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం మెడికల్ కళాశాలను మొట్టమొదటి స్థానంలో నిలిపి చరిత్ర సృష్టించే అవకాశం ఉన్నప్పటికీని ఇవేమీ పట్టించుకోకుండా మా జీతం మాకు వస్తే చాలు విద్యార్థుల భవిష్యత్తుతో మాకేం పని అనే విధంగా వ్యవహరిస్తున్నారని, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారు వారంలో మూడు రోజులు గైర్హాజరైతే విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారని ఆయన విమర్శించారు.అదేవిధంగా అసలు ఈ ప్రిన్సిపాల్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాలా! ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ అ !! అని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ దవఖానలో విధులు నిర్వహించే కొంత మంది దళిత సిబ్బందిని కక్షపూరితంగా సస్పెండ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వ దవఖానకు ప్రిన్సిపాల్ కి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.సస్పెండ్ చేసిన వారిని యుద్ధ ప్రాతిపాదికన ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.నియమ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తూ , ప్రభుత్వ దవఖానలో జోక్యం చేసుకుంటున్న ప్రిన్సిపాల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని, కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోడిసెల ప్రణీత్ , అక్కపాక సాయి చరణ్, జశ్వంత్, సజన్, సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :