Thursday, 30 July 2026 10:17:07 AM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు...

మంథని ఏఎంసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Date : 13 April 2025 12:37 PM Views : 587

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని సన్నవడ్లకు రూ.500బోనస్ చెల్లించడంతో రైతుల్లో సంబురం నెలకొందని ఐటి,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి., మంథని ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మంథని ఏఎంసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ.. రైతును రాజుగా చూసేందుకు తమ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ లాంటి తదితర పథకాలను అమలు చేసి రైతుల్లో భరోసా నింపుతుందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాళ్కు 4కిలోల కోత విధించిందని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యంలో గింజ కటింగ్ లేకుండా ధాన్యం డబ్బులు చెల్లింపు చేయడం జరిగిందని అన్నారు. రైతు లకు ధాన్యం అమ్ముకోవడంలో ఇబ్బంది కలగకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :