Friday, 31 July 2026 07:28:21 PM

తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుంది...

హామీలు నేరవెర్చాలనీ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు... రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 04 December 2024 02:52 PM Views : 578

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో దుర్మర్గాపు పాలన సాగుతుందని...హామీలు నేరవెర్చాలనీ ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామిలను అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని టీబీజీకేఎస్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ ప్రజా వంచన నిరసనగా దీక్షను చేపట్టారు. నిరసన దీక్ష ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ని బలవంతంగా అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామిలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.ఎన్ని అరెస్టులు చేసిన ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చంతా వరకు ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమం లో నాయకులు గోపు అయులయ్య యాదవ్ నారాయణదాసు మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి పిల్లి రమేష్ జడ్సన్ సట్టు శ్రీనివాస్ కుడుదుల శ్రీనివాస్ దాసరి అనంద్ కొడి రామకృష్ణ సారయ్య జిట్టవేన ప్రశాంత్ కుమార్ ఆవునూరి వెంకటేష్ ఓదేలు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :