ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : మంథని మండలం మైదుపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు నాలుగు కిలో మీటర్లు నడిచి వెళ్లి అడవి ప్రాంతంలో ఉపాధి హామీ పనులు చేస్తున్నారని వారికి రవాణా చార్జీలను ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉపాధి హామీ పని చేస్తున్న ప్రదేశాన్ని సందర్శించి అక్కడ పనిచేస్తున్న మహిళలతో మాట్లాడి వివరాల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....పనిముట్లైన పార గడ్డపార తట్టలు కూలీలే కొనుకుంటున్నారని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. నాలుగు కిలోమీటర్లు పోయి వచ్చే క్రమంలో ప్రమాదాలు జరుగుచున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పని ప్రదేశంలో కలిస సౌకర్యాలు లేవని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఉపాధి కూలీలకు రవాణా చార్జీలను ఇచ్చి రెండు నెలల కూలీల డబ్బులు విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ల నాలుగు నెలల వేతనాలు ఇవ్వాలని పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు తూండ్ల కనకయ్య తమ్మిశెట్టి మల్లయ్య ఇసంపల్లి శ్రీనివాస్ పంతంగి లక్ష్మి పెట్టం పుష్ప తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News