ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని ప్రాంతంలోని గోదావరి నది లో వివిధ పరిశ్రమల వ్యర్ధాల ద్వారా వస్తున్న రసాయనాల విషపూరితమైన నీరు చేరుకొని ప్రవహిస్తుందని, దిని వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాలు బారిన పడుతున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అసలు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు.ఏళ్ల తరబడి కాలుష్య నియంత్రణ అధికారులకు అనేక సార్లు చెప్పినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ నిర్లక్ష్యం చేయడం వారికి అలవాటుగా మారిందన్నారు.కావున గొదావరి నది లో ప్రవహిస్తున్న ప్రమాదకరమైన కలుషిత విషపు నీరుపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ, కేంద్ర కాలుష్య నియంత్రణ శాఖతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ర్లకు ట్విట్టర్ X ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని దినేష్ తెలిపారు.
Admin
Aakanksha News