Thursday, 30 July 2026 08:52:15 AM

ప్రజల రవాణా హక్కులను కాపాడటం మన అందరి బాధ్యత...ఓదెల ఎస్ఐ దికొండ రమేష్..

కేజీ వీల్స్ ట్రాక్టర్ల రోడ్లపై నడకపై నిషేధం... ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

Date : 10 July 2025 06:00 PM Views : 772

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో తారు రహదారులపై కేజీ వీల్స్ ట్రాక్టర్ల నడకపై పెద్దపల్లి జిల్లా పోలీసులు ఉగ్రంగా స్పందిస్తున్నారు. గురువారం పోత్కపల్లి నుండి మడక మధ్యల ప్రధాన రహదారిపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరుగుతుండటాన్ని గుర్తించిన ఓదెల ఎస్ఐ దికొండ రమేష్ ఆధ్వర్యంలో వెంటనే కార్యాచరణ ప్రారంభించి రెండు ట్రాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓదెల ఎస్‌ఐ దికొండ రమేష్ మాట్లాడుతూ.. తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరిగితే రహదారులు తీవ్రంగా దెబ్బతింటాయని, ప్రజలకు రవాణా అసౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.పట్టుబడిన ట్రాక్టర్లను ఓదెల తహసీల్దార్ కార్యాలయానికి జరిమానా విధించేందుకు పంపినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ నిషేధం మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.ప్రతి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్లతో సమావేశాలు నిర్వహించి, కేజీ వీల్స్ వాడకంపై అవగాహన కల్పించనున్నామని ఎస్‌ఐ చెప్పారు. పై అధికారులు ఇప్పటికే కేజీ వీల్స్ ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.ఇలా రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరిగితే మొదటిసారి రూ.5000, రెండోసారి రూ.10000, మూడవసారి రూ.20000 జరిమానా విధించి, సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు తమ ట్రాక్టర్లకు పట్టీలు వేయించుకోవాలని సూచించారు. ఎవరికైనా కేజీ వీల్స్ ట్రాక్టర్లు రోడ్లపై తిరుగుతున్న సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ నెంబర్ 8712656514 కు తెలియజేయాలన్నారు. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు చట్టాలకు కట్టుబడి సహకరించాల్సిన అవసరం ఉందని, ప్రజల రవాణా హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని ఎస్‌ఐ అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :