ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్ హౌజ్ కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ డి.రమేష్ స్థానిక విద్యార్థులకు స్టేషన్ వ్యవస్థపై విస్తృత అవగాహన కల్పించారు.పోలీస్టేషన్‌లో ఉండే రిసెప్షన్ విధానం, కేసు డైరీలు, ఆయుధాల వాడకం, షీటీమ్స్ విధులు, గంజాయి వాడకానికి సంబంధించిన అనర్దాలు, సైబర్ మోసాలపై విద్యార్థులను వివరంగా అవగాహన కల్పించారు. అలాగే నేర నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, దొంగతనాలపై శిక్షలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను వివరిస్తూ, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, కంట్రోల్ రూమ్ పరికరాలు, కమ్యూనికేషన్ మ్యాన్‌ప్యాక్ సెట్‌ల వాడకంపై ప్రాథమిక సమాచారం ఇచ్చారు.గంజాయి, మత్తు పదార్థాల వాడకానికి బానిసవుతున్న యువత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, వాటి వల్ల జీవితాలు నాశనం కావడంతోపాటు కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎస్ఐ హెచ్చరించారు. విద్యార్థులు అసహజ అలవాట్లకు దూరంగా ఉండాలని, చట్టాల పట్ల గౌరవం కలిగి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News