Thursday, 30 July 2026 01:39:21 PM

అక్రమంగా రవాణా చేస్తున్న 79.50 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...

Date : 12 March 2025 09:17 PM Views : 560

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 ఇంక్లైన్ వద్ద, మంథని నుండి గోదావరిఖని మీదుగా మహారాష్ట్రకి TS-02-UA 1517 డీసీఎం వ్యాన్ లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న మంథని శ్రీపాద కాలనీకి చెందిన దేశెట్టి మారుతి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి విలువ సుమారు 3,08,100/- రూపాయలు ఉంటుందన్నారు. అలాగే మంథనికి చెందిన రాచర్ల రమేష్,ఓదెల మహేందర్, సిరోంచకు చెందిన యెల్లంకి వీరన్ లు పరారీలో ఉన్నారని తెలిపారు. దీంతో పాటు స్వాదీన పరుచుకున్న 79.50 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, డీసీఎం వ్యాన్, నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ లకు అప్పగించడం జరిగిందన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :