ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : క్రీడల్లో ప్రతిభ ఘనపరుస్తూ పథకాలు సాధిస్తున్న నైపుణ్యం గల క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సహకారాన్ని అందిస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం రామగుండం రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఇటీవల సంగారెడ్డి లో జరిగిన అండర్ 14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీలో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన కరాటే క్రీడాకారులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అభినందించారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలో రాణించాలని పిలుపునిచ్చారు, క్రీడాలభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. త్వరలో రామగుండంలో నిర్వహించబోయే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రస్థాయి పోటీలపై ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చర్చించారు. ఎస్ జి ఎఫ్ కరాటే పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచిస్తూ పోటీలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు. ఎస్ జి ఎఫ్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో అత్యధిక పథకాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జపాన్ షీటోరియో కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తగరపు శంకర్, విక్టరీ షుటో ఖాన్ మాస్టర్ సురేష్ , జపాన్ సిటోరియో కరాటే స్కూల్ తెలంగాణ స్టేట్ చీఫ్ అండ్ బెల్ట్ ఎగ్జామినర్ కరాటే శ్రీనివాస్, టైగర్ కరాటే క్లబ్ అధ్యక్షులు పసుపునుటి శంకర్, రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News