Thursday, 30 July 2026 12:34:20 PM

ఘనంగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు...

Date : 11 April 2025 06:19 PM Views : 405

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథని మండలం రచ్చపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావూ పూలే జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని సత్తార్ జిల్లాలో జన్మించి, ఉన్నత విద్యను అభ్యసించి దేశంలో కుల వివక్షత, అసమానతలపైన అందరికీ సమాన హక్కుల కోసం పోరాడారన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారన్నారు. మహిళలకు విద్యను నేర్పించి మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన మహనీయులు జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే అన్నారు. వారి ఆశయ సాదన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీపీ కొండా శంకర్, నాయకులు జనగామ నర్సింగరావు, మంథని సురేష్, మంథని సత్యం, వేరవేన లింగయ్య యాదవ్, ఎరుకల ప్రవీణ్, మంథని శ్రీనివాస్, నాగుల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :