Friday, 31 July 2026 03:42:11 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు....

Date : 21 November 2024 07:56 AM Views : 587

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగా నగర్ లోని గోదావరి బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడిన సంఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని నుండి ద్విచక్ర వాహనంపై సమీర్, బాలుడు (17)లు అనే ఇద్దరు మంచిర్యాల వైపు వెళ్తుండగా గోదావరి బ్రిడ్జి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో బాలుడి కాలుకు తీవ్ర గాయాలు కాగా సమీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. ద్విచక్ర వాహనంపై అదుపుతప్పి కింద పడిపోయారా లేక గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిందా అనేది తెలియాల్సి ఉంది...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :