ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి, జూలపల్లి మండలంలోని కోనరావుపేట గ్రామాలల్లో శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు నూతన ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ నిర్వహించి ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మొదటి విడుతగా ఎలిగేడు మండలంలోని శివపల్లి, జూలపల్లి మండలంలోని కోనరావుపేట గ్రామాలల్లో ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. త్వరలోనే పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గానికి 14 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసే అవకాశం ఉందని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా అర్హులైన పేదలకు ఇండ్లను, అలాగే వివిధ సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మంజూరి కోసం కానీ, బిల్లుల కోసం కానీ దళారులను ఆశ్రయించవద్దని, ఎవరికి కూడా నయాపైసా ఇవ్వవద్దని ఎమ్మెల్యే సూచించారు. లబ్ధిదారుల పట్ల పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, లబ్దిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News