Thursday, 30 July 2026 04:39:09 PM

అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన రామగుండం ఎమ్మెల్యే...

Date : 25 January 2025 01:15 PM Views : 632

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలోని 31 వ డివిజన్ సీతానగర్ లో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ అరుణశ్రీ, మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మూడు కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. అలాగే దాదాపు 3 కోట్లతో 30వ డివిజన్ సీతానగర్ లో రోడ్డు, వాటర్ యూజీడి, వినాయక మండపం, దగ్గర యూజుడి రోడ్డు, మల్లికార్జున్ నగర్ లో బ్రిడ్జి, అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ భవన్ , రెల్లి వాడలో యూజుడీ ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు...ఎవరు కూడా అధైర్య పడవద్దని ఇది ప్రజా పాలన ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలుగు పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్ ,అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని సదుద్దేశంతో గ్రామ సభలు పెట్టడం జరిగిందని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :