Thursday, 30 July 2026 10:17:23 AM

రామగుండంలో ప్రజపాలన కాదు... పోలీస్ పాలన నడుస్తోంది...

దళిత మహిళలను సీఐ దుర్బాషలాడటం దుర్మార్గం.... ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తున్నారు...రామగుండం మాజీ ఎంఎల్ఏ కోరుకంటి చందర్

Date : 17 November 2024 05:24 PM Views : 1286

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండంలో ప్రజపాలనకు కాకుండా పోలీస్ ర్యాజం... పోలీస్ పాలన నడుస్తోందని, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తూ BRS నాయకులపై పోలీసులతో దాడులు చేయిస్తూ, అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ధ్వజం మెత్తారు. అదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజాపాలన బదులు పోలీస్ పాలన, నియంత పాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రతిపక్ష పార్టీగా నిరసన కార్యక్రమం చేపట్టకుండా పోలీసులతో తమను ఎక్కడికి అక్కడ అడ్డుకుంటూ, దాడులు చేస్తూ తమపై కేసులు పెడుతూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తూ ఎమ్మెల్యే ప్రోద్బలంతో మహిళా కార్పొరేటర్లపై కేసులు పెట్టించడమే కాకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళా కార్పొరేటర్లను, దళిత మహిళలను సీఐ దుర్బాషలాడటం దుర్మార్గమని అన్నారు. ట్రస్ట్ కు సంబంధించిన భూమిలో ఆలయాన్ని నిర్మాణం చేయాలని పూనుకుంటే ఎమ్మెల్యే తనకు సంబంధించిన వ్యక్తితో తమపై, తన తండ్రిపై, అక్కడ ఉన్న వారిపై పెట్రోల్ పోసి హత్యచేయాలని చూసారని అయినా పోలీసులు అతనిపై హత్యాయత్నం కేసు పెట్టకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీస్ పై అధికారులు చర్యలు తీసుకోకపోతే IG వరకు వెళ్తామని అప్పటికి న్యాయం జరగకపోతే ప్రజా క్షేత్రంలో పోరాటాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు అంతర్గo మాజీ జెడ్పీటీసీ అముల నారాయణ, కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణీ,కవితా సరోజినీ,రమ్య యాదవ్,ముద్దసాని సంద్యారెడ్డి,గుర్రం పద్మ,అచ్చే వేణు,మారుతి, జహీద్ పాషా,నూతి తిరుపతి,పిల్లి రమేష్, తోకల రమేష్, నీరటీ శ్రీనివాస్,కిరణ్ జీ తదితరులు పాల్గొన్నారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :