Friday, 31 July 2026 04:46:31 PM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు అండగా కందుల'

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత..!

Date : 13 December 2024 09:21 PM Views : 1035

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఇటీవల కుక్కలగూడూర్ గ్రామంలో ముగ్గురు యువకులు దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాలకు కందుల సంధ్యారాణి అండగా నిలిచారు.వారి కుటుంబాలను పరామర్శించి నేనున్నానంటూ దైర్యం చెప్పారు. అనంతరం ఈ విషాదకర ఘటనపై తెలంగాణ పెరికకుల సంక్షేమ సేవా సమితి సభ్యులతో చర్చించి బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ సందర్బంగా వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ పెరికకుల సంక్షేమ సేవా సమితి సభ్యులు 51000/- రూపాయలు మరియు కుక్కలగూడూర్ వాస్తవ్యులు ఎన్నారై పోతరాజుల రాధాకిషన్ 10000 వేల రూపాయలు అందించగా ఇట్టి మొత్తాన్ని కందుల సంధ్యారాణి చేతుల మీదుగా, గ్రామంలోని కుల పెద్దలతో కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ...రోడ్డుప్రమాదంలో నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడం చాలా బాధాకరం అని అన్నారు. ఈ నష్టంతో వారి కుటుంబాలలో కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారి కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్ధిక సహాయం అందించడం జరిగిందన్నారు.అలాగే బాధిత కుటుంబాలకి భవిష్యత్తులో అండగా ఉంటామని తెలిపారు.ఈ సందర్బంగా ప్రమాద బాధిత కుటుంబాలకు బాసటగా ఆదుకోవడానికి ముందుకు వచ్చిన రాష్ట్ర పెరిక సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బోడకుంటి సత్తయ్య,బీయాల విఠల్, బోడకుంట తిరుపతి, గోపు రామయ్య, పత్తిపాక సుధాకర్,బి జెలెందర్, మల్లయ్య, హరీష్, అంజి,కోడూరి శంకరయ్య,తిరుపతి,అందుగుల మల్లేష్,బొడ్డు మొగిలి,నలిమెల తిరుపతి తదితరులు పాల్గొన్నారు...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :