ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కేంద్ర ప్రభుత్వం వక్ప్ బిల్లును వెంటనే రద్దు చేయాలని ముస్లిం వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ప్ బిల్లుకు నిరసనగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ముస్లిం లకు చెందిన బట్టల దుకాణలు, చెప్పుల దుకాణాలు, జనరల్ స్టోర్స్, పండ్ల దుకాణాలు, పూల దుకాణాలు, పంక్చర్ షాపులు, హోటల్లు,ఆటో స్టోర్స్, స్వచ్ఛందంగా తమ షాపులు మూసివేసి బందు నిర్వహించి తమ నిరసన ను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన వక్ప్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ముస్లిం వ్యాపారులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News