Friday, 31 July 2026 10:37:06 PM

ఆపదలో ఆదుకునే వెలుగు సురభికి మనవత్వ సేవా పురస్కారం....

Date : 18 April 2025 12:35 PM Views : 367

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎందరో జీవితాలకు వెలుగునిస్తూ, ఆపదలో నేనున్నానని తనవంతుగా ఎంతోమందికి వెలుగు సామాజిక స్వచంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవలను అందిస్తున్న చైర్మన్ అండ్ ఫౌండర్ సురభి శ్రీధర్ ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్పూర్తి అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు, తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో 2025 మనవత్వ సేవా పురస్కారం అవార్డుకు ఎంపికయ్యారు.ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్, కోడెల మంజుల, కోఆర్డినేటర్, లయన్ డాక్టర్, ఆకుల రమేష్, గౌరవ సలహాదారులు డాక్టర్, గూడూరు చేన్నారెడ్డి, స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో. కోశాధికారి డాక్టర్ కుమారస్వామి. చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సురభి శ్రీధర్ మాట్లాడుతూ... వివిధ రంగాలలో సేవలందిస్తున్న సామాజిక సేవకులకు రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని ఎంపికయ్యారు.ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ నిర్వహించడం జరిగిందన్నారు. అవార్డు రావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్నారు. అలాగే వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతోనే ఈ పురస్కారం అందుకోవడం జరిగిందని అన్నారు. అలాగే వెలుగు సామాజిక స్వచ్ఛంద సేవ సంస్థకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. డా,సురభి శ్రీధర్ కు పురస్కారం రావడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :