Sunday, 26 April 2026 06:43:00 PM

మహనీయుల విగ్రహాలను అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ఈనెల 11వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు మహనీయుల దీక్ష...

Date : 05 April 2025 06:55 PM Views : 412

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మహనీయుల విగ్రహాలను కాంగ్రెస్ పార్టీ అపహస్యం చేస్తుందని మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రావు 117 వ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మహనీయుల చరిత్రను ప్రజలకు వివరించేందుకు ఐదు రోజుల పాటు మహనీయుల దీక్ష చేపడుతున్నట్లు పుట్ట మధుకర్ స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మహనీయుల విగ్రహాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. అలాగే మంథనిలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలను తాకవద్దని కిందిస్థాయి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న మంథని ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క మహనీయుల విగ్రహాన్ని కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంతిని నియోజకవర్గంలో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :