Saturday, 01 August 2026 01:23:57 AM

ఘనంగా 'గణతంత్ర' దినోత్సవ వేడుకలను నిర్వహించాలి...

ఆర్జీ-2 జీఎం బండి వెంకటయ్య

Date : 21 January 2025 07:16 PM Views : 438

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆర్జీ-2 ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య అన్నారు. మంగళవారం జీఎం అఫీసులోని కాన్ఫరెన్స్ హాల్ లో వేడుకల నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా జీఎం మాట్లాడుతూ..స్థానిక అబ్దుల్ కలాం స్టేడియం వేదికగా నిర్వహించే వేడుకల్లో ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయాలని, వేడుకలను తిలకించేందుకు వచ్చే కార్మిక, కార్మికేతర కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.అందరి సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు.ఈ సమావేశంలో వకీల్ పల్లి ఏజెంట్ ఏ.నెహ్రూ, ఎస్ఓ టు జిఎం ఎం.రాముడు, ఏరియా రక్షణ అధికారి ఎస్.సంతోష్ కుమార్, డిజిఎం (పర్సనల్),ఏరియా అధికార ప్రతినిధి అనిల్ కుమార్, డిజిఎం (సివిల్) ధనుంజయ, డిజిఎం (వర్క్ షాప్) ఎర్రన్న, డీజీఎం (నిమ్) ఎస్డీఏం హుస్సైనీ, డిజిఎం (ఐఈడి) మురళీకృష్ణ, డిజిఎం స్టోర్స్ సుజన్ మెహ్రా, మెడికల్ సూపరింటెండెంట్ డా.మహిపాల్, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవ రావ్, సీనియర్ సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్, డిప్యూటీ మేనేజర్ (క్వాలిటీ)సుభాష్, ఎస్ఇ పర్చేజ్ పండరీనాధ్, మేనేజర్ ఏంవిటిసి మురళీకృష్ణ, సీనియర్ ఎస్టేట్స్ అధికారి జె.సునీత, ఫారెస్ట్ అధికారి నవీన్ కుమార్, మరియు జెఇ సివిల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :