ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని ప్రభుత్వమే నేరుగా సంక్షేమ బోర్డు పథకాలను కార్మికులకు అందించాలని ఐ. ఎఫ్. టీ. యు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ. నరేష్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంకై ఐ ఎఫ్ టీ యు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఏ. ఎల్. ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రంను అందజేశారు.ఈ సందర్భంగా ఈ. నరేష్ మాట్లాడుతూ... రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్న భవన ఇతర నిర్మాణ రంగా కార్మికులు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని పనులు దొరకక పని స్థలాల్లో రక్షణ లేక శ్రమకు తగిన ప్రతిఫలం లభించక అనేక అవస్థలు పడుతున్నారన్నారు.అర కోర దొరికిన పనులలో ప్రాణాలను పణంగా పెట్టి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక కుటుంబాలు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.భవన నిర్మాణ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రమాద బీమా 10.లక్షల రూపాయలు ఇవ్వాలని,55.సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు10.వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని,కార్మికుల అడ్డాల వద్ద కనీస సదుపాయాలు కల్పించాలని, కార్మికులందరికీ పక్కా గృహాలు,రేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు కే.ఎల్లయ్య, ఐ.రాజేశం,ఎం. దుర్గయ్య, జీ. మల్లేశం,ఎడ్ల. రవికుమార్, ఎం. కొమరయ్య, బి. రాజనర్సు, గుండు రాజయ్య, కే రాజమౌళి, భూషణం, ఐ సాంబయ్య, రేణిగుంట్ల సదయ్య,అన్వేష్. తదితరులు పాల్గొన్నారు.
Reporter
Aakanksha News