ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా వ్యాల్ల హరీష్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా తస్నిమ్ భాను, జాహిద్ పాషా ఆధ్వర్యంలో గోదావరిఖని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం 500 మంది నిరుపేద ముస్లీం కుటుంబాలకు రంజాన్ తోఫా (నిత్యావసర సరుకుల) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాళ్ళ అనసూర్యరాంరెడ్డి దంపతులు మరియు బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకులు జమీలుద్దీన్ హాజరై నిరుపేద ముస్లీం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫౌండేష్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్‌రెడ్డి మానవతా హృదయంతో నిరుపేద ముస్లీం కుటుంబాల్లో రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. హిందు, ముస్లీంలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం తెలంగాణ సంస్కృతిగా కొనసాగుతుందన్నారు. భవిష్యత్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా వీహెచ్‌ఆర్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేస్తామన్నారు. వీహెచ్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ సిగిరి రాము అలాగే మైనార్టీ నాయకులు మున్వర్,మీర్ ఫయాజ్‌అలీ, హస్సేన్, టిప్పు సుల్తాన్, మొయిన్, పొలాడి శ్రీనివాసరావు, వంశీకృష్ణ, కొండ సురేష్, నర్సింగారావు, కడార్ల శ్రీధర్, అన్ను, బుర్‌హాన్, అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News