Thursday, 30 July 2026 12:03:37 PM

భూ ఆక్రమణపై విచారణ జరిపించాలి....

రంగాపూర్ పంచాయితీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి.

Date : 12 March 2025 06:39 PM Views : 638

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో తన భార్య పేరుపై వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో ఒప్పందం ప్రకారం పూర్తి డబ్బులు చెల్లించకుండా అక్రమంగా భూఆక్రమణకు పాల్పడ్డ పెద్దపల్లి మండలం రంగాపూర్ పంచాయితీ కార్యదర్శిగా పని చేస్తున్న గుమ్మడి సదయ్యపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. లావణ్య అధికారులను కోరారు. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా పంచాయితీ అధికారి వీర బుచ్చయ్య లకు పిర్యాదు చేశారు. ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన భూమికి చెల్లించాల్సిన మిగతా డబ్బులు ఇవ్వకుండా అక్రమంగా భూమిని ఆక్రమించుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగాపూర్ పంచాయితీ కార్యదర్శిగా పనిచేస్తున్న గుమ్మడి సదయ్యపై చొప్పదండి పోలీస్ స్టేషన్లో గత నెల 21న పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్లు ఆమె తెలిపారు. పంచాయితీ కార్యదర్శి సదయ్య భూ ఆక్రమణ, అసమానత ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :