Thursday, 30 July 2026 09:54:06 PM

ఖాకీల రక్షణకు... ఖాద్దర్ చొక్కా మారక...

ప్రజాభిప్రాయ సేకరణలో పోలీస్ వర్సెస్ పొలిటికల్...

Date : 29 January 2025 04:16 PM Views : 1487

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసానిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి ఎంతో మంది పోలీసులు తమ విధి నిర్వహణను నిర్వహిస్తున్నారు. తమ కుటుంబాలకు కూడా సమయం కేటాయించని పరిస్థితిలో ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ ( శాంతి భద్రతల పరిరక్షణ) కోసం నిత్యం పరితపిస్తూ ఎంతో మంది పోలీసులు కత్తి మీద స్వాముల తమ విధులను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల వారు విధులు నిర్వహించే సమయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వృత్తి నిర్వహణలో భాగంగా ప్రజా రక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఎన్నో ఆటంకాలను సైతం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భారీగా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ స్థానిక వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. క్రమంలోనే ఓ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి తమ విధి నిర్వహణను నిర్వహిస్తున్న క్రమంలో జరిగిన ఘటన రాజకీయ వర్గాలతో పాటు పోలీసు వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు చెబుతూ తారతమ్యం భేదం లేకుండా తమ విధి నిర్వహణను నిర్వహిస్తున్న సదురు ఉన్నతాధికారి పట్ల జరిగిన తీరు ఆందోళనకర పరిస్థితికి దారితీసింది. అక్కడే ఉన్న స్థానికులు అయితే నేమి, ఇతర సిబ్బంది అయితేనేమి జరిగిన సంఘటన గురించి పూర్తి అవగాహన, ఉన్న ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉండడం పట్ల అయోమయ పరిస్థితిలో నెలకొన్నాయి. ఓ వైపు పోలీస్ ఉన్నతాధికారులు తమ విధి నిర్వహణ పట్ల ఎవరిని ఉపేక్షించేది లేదని, ప్రజా రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న కొంత మంది పోలీసు అధికారుల మీద రాజకీయ రాజకీయ పెత్తనం చలామణి అవుతుండడం కోసమెరుపు.... ఇప్పుడు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చపై మరింత పూర్తి కథనం "ఆకాంక్ష" న్యూస్ లో

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :