ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ అస్పత్రి (జీజీహెచ్) ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేసారు. అయితే అస్పత్రిలో సూపర్ వైజర్ తాజోద్దీన్ వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తనిఖీకి వచ్చారా... లేక నూతన అస్పత్రి పనులకు సంబందించిన వివరాలను తెలుసుకోవడానికి వచ్చారా... అనేది తెలియాల్సి ఉంది... ఈ సూపర్ వైజర్ వ్యవహారంలో ఓ అధికారిణినీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నట్లు సైతం ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఓ కార్మికురాలిని ఇబ్బందులకు గురి చేసిన సదురు సూపర్ వైజర్ పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Admin
Aakanksha News