Thursday, 30 July 2026 12:27:53 PM

అస్పత్రి తనిఖీకి వచ్చిన డీఎంఅండ్ హెచ్ఓ పట్ల ప్రవర్తించిన తీరు దుర్మార్గం..

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు హాస్పిటల్స్ పై చర్యలు చేపట్టండి... న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్

Date : 28 April 2025 03:38 PM Views : 752

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్వతంత్రచౌక్ లోని శ్రీ మమత హాస్పిటల్ కు తనిఖీ చేయడానికి వచ్చిన పెద్దపల్లి డీఎంఅండ్ హెచ్ఓ పట్ల హాస్పిటల్ యాజమాన్యం, ఐఎంఏ సభ్యులు రాజకీయ నాయకులు ప్రవర్తించిన తీరు దుర్మార్గం అని మీ ప్రవర్తన పట్ల సమాజానికి ప్రజలకు ఏమి సంకేతాలు ఇస్తున్నారని న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...డీఎంఅండ్ హెచ్ఓ గోదావరిఖని పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ను సందర్శించి పర్యవేక్షణ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులరేషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న హాస్పిటల్స్,ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్స్, ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిబంధలను నియమాలను పాటించకుండా నిర్వహిస్తునన్న యాజమాన్యాల మీద ఉక్కు పాదం మోపడం చాలా సంతోషకర విషయం అన్నారు.అయితే వైద్యాధికారి తనిఖీ కోసం వచ్చిన సమయంలో ఇలాంటి అక్రమ అనుమతులు లేని స్కానింగ్ మిషన్లు పెట్టి అక్రమ మార్గాలలో డబ్బు సంపాదిస్తున్న కొంత మంది హాస్పిటల్ యాజమాన్యం సహకరించకుండా రాజకీయ నాయకులతో కలసి నాన రభస చేయడం దుర్మార్గం దుష్ట చర్య ఇది వారి విజ్ఞతకే వదిలేద్దాం అని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని పట్టణంలో చాలా హాస్పిటల్ కి ఏ విధమైన డీఎంఅండ్ హెచ్ఓ నియమ నిబంధనలకు లోబడి అనుమతులు లేవని మరియు హాస్పిటల్లో OT థియేటర్ కానీ ఓపీ ఛాంబర్స్ కానీ మరుగుదొడ్లు, బాత్రూంలు, వాటర్ సౌకర్యం, వార్డులు, ఐసీయూ, పార్కింగ్ స్థలం, ఫైర్ సేఫ్టీ, వెంటిలేషన్, ముఖ్యంగా లిఫ్ట్ లేకుండా ర్యాంపు లేకుండా మెట్ల పై నుండి పేషెంట్ ని ఒక ఫ్లోర్ నుండి ఒక ఫ్లోర్ కి షిఫ్ట్ చేయడానికి అనువుగా లేని అతి డేంజరస్ హాస్పిటల్స్ నియమ నిబంధనలకు హాస్పిటల్ పనికొచ్చే వాతావరణం ఆవరణలో లేనివి ఎన్నో ఉన్నాయని అన్నారు. డీఎంఅండ్ హెచ్ఓ ప్రతి హాస్పిటల్ సందర్శించి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అలాగే నిబంధనలకు అనుగుణంగా లేని నిబంధనలను పాటించని హాస్పిటల్స్ పై చట్టపరమైన చర్యలు చేపట్టి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ హాస్పిటల్ చేస్తున్న సమయంలో ఒక వీడియో గ్రాఫర్ ను పెట్టి ప్రతిదీ వీడియో రికార్డు చేయించాలని ఇలాంటి నిజాయితీగా పని చేసే డీఎంఅండ్ హెచ్ఓ కు ఓత్తిళ్లు లేకుండా విధులను నిజాయితీగా నిర్వహించాలని ఆయన కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :