ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / వరంగల్ జిల్లా : మటన్ మార్కెట్ నూతన అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకొని రామగుండం నియోజకవర్గం మొత్తం ఒకే ధరకు మటన్ అమ్మాలని నిర్ణయించినట్లు సంఘ బాద్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు బాధ్యులు మాట్లాడుతూ... యూనియన్ లో అంతర్గత మనస్పర్దాల నేపథ్యంలో కొంత మంది తక్కువ ధరకు మటన్ అమ్మడం వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు అందరితో చర్చించిన అనంతరం సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. అయితే ఈ సమావేశంలో 150 మంది సభ్యులు ఉండగా సుమారుగా 120 మంది సభ్యులు పాల్గొన్నారని అందరి అభిప్రాయం మేరకే కేజీ మటన్ రూ, 700, మేకపోతు కేజీ రూ, 800 లుగా నిర్ణయించడం జరిగిందన్నారు. దీనికి సంఘ సభ్యులు అందరూ ఆమోదం తెలిపారని ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ తమకి సహకరించాలని వారు కోరారు. నేటి నుండి ఈ ధరలు అమల్లోకి వస్తాయని వారు స్పష్టం చేశారు.
Admin
Aakanksha News