Saturday, 01 August 2026 03:23:43 AM

శ్రీ చైతన్య, నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి.

బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నాయకులు చింటు,శ్రావణ్

Date : 24 November 2024 04:13 PM Views : 481

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని బీఆర్ఎస్వి విద్యార్ధి విభాగం నాయకులు చింటు, శ్రావణ్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలల సెలవు రోజు కూడా పాఠశాలలను నడిపిస్తూ విద్యార్థిని విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలలను నడిపిస్తూ వారు ఇష్ట రాజ్యాంగా చెలమణి అవుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న కనీసం విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించని శ్రీ చైతన్య నారాయణ పాఠశాలలపై ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :