Thursday, 30 July 2026 12:31:59 PM

అమ్మవారి భక్తులకు అన్నదానం...

Date : 08 October 2024 04:32 PM Views : 410

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక మంత్రపురి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు లోకే కుటుంబ సభ్యులు భారీ ఎత్తున అన్నదానం చేశారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా వారికి లోకే కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆలయానికి భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లోకే రాధాకిషన్ రావు, లోకే సుధాకర్ రావు దంపతులు, లోకే మనోహర్ రావు, కుటుంబ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :