ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : ఆర్టీసీ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణ చర్యలపై ఫైర్ అధికారులు ఆర్టీసీ కార్మికులకు అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంగళవారం మంథని ఆర్ టి సి బస్ డిపోలో సిబ్బందికి, కార్మికులకు అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ చర్యలపై వివరించారు. అగ్ని ప్రమాధాలు జరిగినపుడు ఎలా నివారణ చేయాలో, ప్రయాణికులు ఆర్ టి సి బస్సుల్లో ప్రయాణం చేసేటపుడు ఏదైనా ప్రమాదం సంబవించినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలో డ్రైవర్, కండాక్టర్ లకు అవగాహన కలిగించామని మంథని అగ్నిమాపక అధికారి శివ శంకర వర ప్రసాద్ పేర్కొన్నారు. అదే విధంగా ప్రయాణ ప్రాంగణాల్లోని ప్రయాణికులకు అగ్నిమపాక నివారణ కర పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సిబ్బంది, లీడింగ్ ఫైర్ మన్ మేడ దేవేందర్, ఫైర్ మన్ నరేందర్, రఘు, డ్రైవర్ రమేష్, నాగరాజు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Aakanksha News