Friday, 31 July 2026 10:39:58 AM

గోదావరిఖనిలో పతంగి మంజా వాడకం నిషేదం...

నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవు : గోదావరిఖని ఏసీపీ

Date : 03 January 2025 02:00 PM Views : 570

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో చైనా మాంజపై నిషేధం విధించినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు.ఎవరైనా చైనా మాంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి సంద‌ర్భంగా చైనా మాంజ విక్ర‌యించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, సంక్రాంతి పండుగ తర్వాత చైనా మంజా వ్యర్దాల వల్ల పక్షులతో పాటు మనుషులకు హాని కలుగుతోందని గోదావరిఖని ఏసీపీ తెలిపారు. చైనా మాంజా అమ్మినా, నిలువ, రవాణా చేసినా ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :