Thursday, 30 July 2026 08:56:25 PM

మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు మరువలేనివి...

మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి... సుతారి లక్ష్మణ్ బాబు

Date : 30 January 2025 12:56 PM Views : 425

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : స్వాతంత్ర ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు మరువలేనివని, నేటి యువత జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి సుతారి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరిఖని చౌరస్తాలో గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుతారి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం ద్వారా శాంతియుత మార్గంలో స్వాతంత్ర సంగ్రామం కోసం పోరాటం చేశారని శాంతి సామరస్యంతో స్వాతంత్రాన్ని సాధించడంలో కీలకపాత్ర వహించాలని ఆయన పేర్కొన్నారు. ఆ మహాత్ముని వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడమే కాకుండా ఆయన చేసిన త్యాగాలు ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో సైతం మహాత్మా గాంధీ ఎంతో కృషి చేశారని ఆయన కొనియడారు. ఈ కార్యక్రమంలో తిప్పారపు శ్రీనివాస్ గడ్డం శేఖర్ తదితరులు పాల్గొన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :