ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఆకాంక్ష డెస్క్ : నల్లబంగారం విస్తరించి ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కోల్ బెల్ట్ జిల్లాల్లో అది అత్యంత ఖరీదైన పోలీస్ స్టేషన్ గా పేరు పొందింది , రాష్టంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విభిన్న రకాలుగా నివసించే ఈ ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం పేరుగాంచింది, ఇక్కడ ఎంతో మంది అధికారులు ఒక్క సరి అయిన విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఉంటారు. ఇంత పేరు ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం ఓ అధికారి వల్ల వివాదాలకు నీలయంగా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో సదురు అధికారి వ్యవహరిస్తున్న తీరు పట్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకవచ్చే విధంగా వ్యవహరించడం పట్ల ప్రజల నుండి స్థానిక నాయకుల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలవుతుంది. ఎవరైనా పోలీస్ స్టేషన్ కు పిర్యాదు చేయడానికి వచ్చిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సదురు అధికారి తన పోలీస్ స్టేషన్ లో ఒక్క వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సదురు అధికారి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి దళితుల పట్ల చిన్న చూపు చూస్తూ ఎవరైనా పిర్యాదు చేయడానికి వెళ్తే గెట్ అవుట్ అంటూ వారిని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్న తీరు వివాదాలకు నీలయంగా మారుతుంది. గోదావరిఖని ఓ పోలీస్ అధికారి తన ఇష్ఠారాజ్యంగా కొంత మంది కింది స్థాయి సిబ్బందిని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్న సదురు పోలీస్ అధికారి తీరుపై ప్రత్యేక కథనం....
Admin
Aakanksha News