Saturday, 13 June 2026 02:48:00 PM

అధికారి వివాదంలో దాగి ఉన్న రాజకీయ రహస్యం.. నాటి నుండి నేటి వరకు అన్ని వివాదాలే....

అధికారిపై చర్యలకు రాజకీయ ఒత్తిళ్లే కారణామా... ఎన్ని వివాదాలు జరిగిన పట్టించుకోని అధికారులు...?

Date : 25 February 2025 09:20 AM Views : 1254

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : సామాన్యులకు అండగా ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసానిస్తూ వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని ఓ వైపు ఉన్నతాధికారులు ఎన్ని సూచనలు చేసిన కొంత మంది అధికారుల్లో మార్పు రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఒక్కటవ పట్టణ పోలీస్ దీనికి నిదర్శనం అని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కమిషనరేట్ పరిధిలో ఏ పోలీస్ స్టేషన్ లో జరగని వివాదాస్పదం ఒక్కటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు ఇప్పటి వరకు దాదాపుగా అన్ని వర్గాల ప్రజల నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదురు అధికారికి జిల్లాకు సంబంధించిన ఓ కీలక మంత్రి,రాజకీయ అండదండలు ఉండటమే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. అంతే కాదు సదురు అధికారిపై ఎప్పుడు ఎటువంటి ఆరోపణలు వచ్చిన కూడా కనీసం ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది... వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 19 వ తేదీన చత్రపతి శివాజీ వేడుకల్లో పటాకులు కాల్చాలని ఓ మైనర్ బాలుడిని సదురు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా సదురు బాలుడి విషయంలో మాట్లాడడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నామాతవాజ్ కిరణ్ జీ అనే న్యాయవాదిపై అనుచితంగా సీఐ మాట్లాడడంతో ఇదే విషయంపై బార్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో దురుసుగా ప్రవర్తించిన సీఐ ఇంద్రసేనారెడ్డి తీరుపై బార్ అసోసియేషన్ విధులను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఎక్కడ విధులు నిర్వహించిన వివాదాస్పదమేనా... ⁉️

పోలీస్ శాఖలో ఈయన రూటే సపరేటు.. కొన్ని సందర్భాల్లో సదురు అధికారి వ్యవహరించిన తీరు పోలీస్ శాఖకు మచ్చ తీసుకోవచ్చే విధంగా ఉండటం పట్ల సొంత శాఖలోని సదరు అధికారిపై చర్చ జరగడం కొత్తేమీ కాదని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన పలు పోలీస్ స్టేషన్లలో అన్ని పోలీస్ స్టేషన్ లలోను వివాదాస్పదం కావడం అధికారుల ఆగ్రహానికి గురికావడం ఈయనకు సర్వసాధారణం అయిపోయిందనే చెప్పవచ్చు. అయితే ఎన్ని సార్లు ఉన్నతాధికారుల నుండి మందలింపులు వచ్చిన ఉన్నతాధికారుల మాటలను కూడా లెక్క చేయకపోవడం పట్ల ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని ఘటనల తర్వాతనైనా కనీసం ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి సదరు అధికారిపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే...

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :