Saturday, 13 June 2026 02:49:41 PM

ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం... రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్

సన్నబియ్యంతో పేదల కడుపు తీపిని తీర్చిన కారణజన్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 18 April 2025 04:59 PM Views : 292

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్ అన్నారు. ఈ సందర్బంగా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో పేద కుటుంబ సభ్యులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం లబ్దిదారుని ఇంట్లో మధ్యాహన భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. గృహజ్యోతి పథకం ద్వారా నిరుపేదల ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.రైతు భరోసా ద్వారా రైతులకు12వేల పెట్టుబడి సహాయం. రైతులకు 2 లక్షల రుణమాఫీ. ప్రజా ప్రభుత్వ తొలి ఏడాదిలోనే 50 వేలకు పైన ప్రభుత్వ ఉద్యోగాలు.ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం.తెలంగాణ రైతంగానికి రక్షణ కవచంగా భూభారతి పథకం. పేద,మధ్యతరగతి ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎస్సి వర్గీకరణకు. బడుగు బలహీన వర్గాల భావితరాల భవిష్యత్తు కోసం బిసిలకు42% రిజర్వేషన్.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకోసం రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఆర్ధిక సహాయం ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు.బిజెపి,బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక,జిర్ణించుకోలేక ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు తదితరులు ఉన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :