ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తెలంగాణ రక్షణ సమితి డెమొక్రటిక్ పార్టీ బలోపేతమే దిశగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా శనిగరపు శివకృష్ణను నియమిస్తున్నట్లు టిఆర్ఎస్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా శివకృష్ణ మాట్లాడుతూ... టిఆర్ఎస్ డి పార్టీ ఎస్సీ సెల్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులుగా నియమించి నాపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన తోడేటి శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, రాష్ట్ర యూత్ సెక్రటరీ జనరల్ ఈదునూరి నర్సింగ్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల రమేష్, మామిడిపల్లి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ నిర్ణయం మేరకు క్రమశిక్షణతో కార్యక్రమాలను నిర్వహిస్తానని పేర్కొన్నారు.
Admin
Aakanksha News