ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : విధుల్లో ఆసత్వం ప్రదర్శించకూడదని ఎల్లప్పుడూ అందరు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ అన్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా వరకు పారిశ్రామిక ప్రాంతం అని ఈ ప్రాంతంలో జరిగే ప్రతి విషయం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన సమాచారం ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఒక టీంల పని చేసినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. నీట్ టర్న్ అవుట్, ఫిట్నెస్ తో, క్రమశిక్షణ తో ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. వాహనాలను కూడా మంచిగా మైంటెనెన్సు చేయాలని వాహనం మీ రథం లాంటివి ఎప్పుడు ఆది మీకు రక్షణగా ఉంటుందని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యల విషయంలో కమ్యూనల్ సమస్యలనేవి ఒకటి కులాల, మతాల, గ్రూప్ ల మధ్య అలాంటివి మీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినప్పుడు అక్కడ ముఖ్య మైన వారు ఎవరు గుర్తించి కారణాలు తెలుసుకోవాలని వెంటనే సంఘటన స్థలాలను చేరుకోని అక్కడ పరిస్థితులను వెంటనే పై అధికారులకు తెలియజేయాలన్నారు. మీరు చేసే డ్యూటీ 24*7 అప్రమత్తంగా ఉండవలసి వస్తుందని మీరు ఏదైనా సంఘటనకు సంబంధించి అలసత్వం ప్రదర్శించినట్లయితే లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. క్రమశిక్షణతో విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించినట్లయితే క్షేత్రస్థాయిలో వారిని గుర్తించి రివార్డులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకూడదని . క్షేత్రస్థాయిలో సిబ్బంది పని చేసినప్పుడే అధికారులకి మంచి పేరు వస్తుందన్నారు.నేరాల నియంత్రణలో,ప్రాపర్టీ సంబంధిత, ఇతర నేరాల నియంత్రణలో బ్లూ కోల్ట్స్,పెట్రో కార్స్ అధికారుల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. డయల్ 100 కాల్ వచ్చినప్పుడు అత్యవసర సమయంలో బాదితులకి వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించి సేవలు అందించాలని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది, ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. అత్యవసర సేవలు అయిన రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, పట్టణాల, గ్రామాలలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మొదలైన వాటికి సంబందించిన డయల్ 100 కాల్ ద్వారా సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బంది లేదా పెట్రోల్ వెహికల్స్ సిబ్బంది తక్షణమే స్పందించి తగు చర్యలు చేయవలసిన అంశాల గురించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.తమ ఏరియా పై సమగ్ర సమాచారం కలిగి ఉండి ఆ ప్రాంత ప్రజల రక్షణకు భరోసా కల్పించాలని అన్నారు. గస్తీ తిరుగుతున్న ఏరియా నుండి రిపోర్ట్ చేయబడిన అన్ని డయల్ 100 ఫిర్యాదులను నిర్ణిత సమయంలో అటెండ్ చేయడంతో పాటు బాధితులకు సత్వర సేవలు అందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్స్ వర్టికల్స్ ఇంచార్జ్ లు బ్లూ క్లోట్స్ మరియు పెట్రో కార్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Aakanksha News